: అమెరికాలో కవలలు ఎక్కువగా జన్మిస్తున్నారు!


కవల పిల్లలు ఎక్కువగా జన్మిస్తున్న దేశం అమెరికా. ఈ సంఖ్య 2014వ సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉన్నట్లు యూఎస్ ఆరోగ్యశాఖ చెబుతోంది. తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2014లో ప్రతి వెయ్యి మందిలో 33.9 మంది కవల పిల్లలే! 2013, 14 సంవత్సరాల్లో అయితే ప్రధానంగా నల్లజాతి మహిళల్లో ఇది 4 శాతం పెరిగింది. కవలలతో పాటు ఒకే కాన్సులో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుడుతున్న సంఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 1980-98 మధ్య కాలంలో ఇటువంటి కాన్పుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాతి ఇరవై ఏళ్లలో ఈ తరహా జననాల రేటు బాగా తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News