: గుర్రమెక్కిన లాలూ పుత్రరత్నం... సెక్యూరిటీ సిబ్బంది కూడా!


ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేసినా ప్రత్యేకమే. మరి ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన ఆయన పుత్ర రత్నాలు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ లు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. అరంగేట్రంలోనే చిన్నోడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎం పదవి చేజిక్కించుకుంటే, పెద్దోడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో తేజ్ దూసుకెళుతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో నానాటికీ కాలుష్యం స్థాయి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ పాట్నా రోడ్లపై గుర్రంపై ప్రత్యక్షమయ్యారు. పొలిటికల్ లీడర్ అవతారం తీసేసి జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరించిన తేజ్ గుర్రంపై స్వారీ చేస్తుండగా, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా గుర్రాలెక్కేశారు. వీరి గుర్రపు స్వారీకి సంబంధించిన వీడియో ఫుటేజీలు నేషనల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News