: ఆఫీసులో పని ఒత్తిడితో.. అంతేసంగతులు


ఆఫీసులో పని ఒత్తిడి మనమీద ఎంత మేరకు పనిచేస్తుంది. ఎంత దుష్ప్రభావం చూపుతుంది. ఆఫీసులో ఒత్తిడి వల్ల వచ్చే చికాకును ఇంట్లో ప్రదర్శించడం.. కుటుంబ వాతావరణం దెబ్బతినడం ఇలాంటివన్నీ ఒక ఎత్తు.. కానీ దీనివల్ల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుందని, గుండెజబ్బుల అవకాశం కూడా ఉన్నదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

జర్మనీలోని హెల్మ్‌హోల్ట్‌జ్‌ జెన్‌ట్రం వారు 950 మంది వివిధ రకాల ఉద్యోగుల్ని పరిశీలించారు. ఆఫీసులో మానసిక ఒత్తిడి గురించి ఓ క్వశ్చనీర్‌ రూపొందించి వారితో సమాధానాలు రాయించారు. సగానికి పైగా ఉద్యోగులు తాము పనిచేసే స్థలాల్లో టెన్షన్‌కు లోనవుతున్నట్లు చెప్పారు. దీంతో కోపం, నిరాశ, నిద్రలేమి, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధన నిర్వహించిన డాక్టర్‌ రెబెక్కా ఎమెనీ, ప్రొఫెసర్‌ కార్ల్‌ హీంజ్‌ చెబుతున్నారు. రోజుకు ఓ గంటయినా క్రీడలకు కేటాయిస్తే.. ఈ ఒత్తిడి ప్రభావం తగ్గుతుందనేది వారి సలహా!

  • Loading...

More Telugu News