: భవిష్యత్తు ఇండియాదే!...‘వృద్ధి’లో టాప్ పొజిషన్ భారత్ దేనంటున్న అమెరికా అధ్యయనం


స్థూల జాతీయోత్పత్తిలో 7 శాతానికి పైగా వృద్ధి నమోదు చేసిన భారత్, అప్పటిదాకా వృద్ధిలో టాప్ పొజిషన్ లో ఉన్న చైనాను వెనక్కు నెట్టేసింది. అంతేకాదు, భారత పారిశ్రామిక రంగం వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు దాదాపుగా షాకిచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఆర్థిక వృద్ధిలో ప్రపంచ దేశాలు నమోదు చేస్తున్న ప్రగతిపై అమెరికాలోని హార్వార్డ్ కు చెందిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (సీఐడీ) చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2014 గణాంకాల ఆధారంగా జరిగిన ఈ అధ్యయనంలో భవిష్యత్తు మొత్తం భారత్ దేనని తేలిపోయింది. ‘అట్లాస్ ఆఫ్ ఎకనమిక్ కాంప్లెక్సిటీ’’ పేరిట ఇటీవల విడుదలైన ఈ అధ్యయనంలో ఆర్ధిక వృద్ధి రేటులో భారత్ ‘టాప్’ పొజిషన్ చేజిక్కించుకోవడం ఖాయమని వెల్లడైంది. రికార్డో హాస్మాన్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం...భారత్ దూసుకెళుతున్న విషయం చైనాకు కూడా తెలిసిపోయిందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News