: ఓ వైపు పుణ్య కార్యం చేస్తూనే, మరో వైపు పాపం చేస్తున్న కేసీఆర్: కోమటిరెడ్డి
చండీయాగం లాంటి పుణ్యకార్యాన్ని చేస్తూనే, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు లాంటి పాప కార్యాన్ని కూడా టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న చిన్నపరెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోలేదని చెప్పారు. కేవలం డబ్బు బలంతోనే చిన్నపరెడ్డి ఎన్నికల బరిలోకి దిగాడని... ఇదంతా కేసీఆర్ పాపమేనని తెలిపారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఓడిపోతే... తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని... టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ తప్పుకుంటారా? అని సవాల్ విసిరారు.