: ముగ్గులేస్తున్న మహిళలే టార్గెట్!... హైదరాబాదులో చైన్ స్నాచర్ల స్వైర విహారం


సంక్రాంతి సమీస్తోంది. మహిళలు ముగ్గులకు మెరుగులద్దుతున్నారు. తెల్లారగట్లే నిద్ర లేస్తున్న మహిళలు తమ ఇళ్ల ముంగిళ్లను ముగ్గులతో అలంకరించే పనిలో నిమగ్నమవుతున్నారు. దీనినే చైన్ స్నాచర్లు అవకాశంగా మలచుకుంటున్నారు. నేటి తెల్లవారుజామున ముగ్గులేస్తున్న మహిళలే లక్ష్యంగా హైదరాబాదులో చైన్ స్నాచర్లు స్వైర విహారం చేశారు. నగరంలోని సైదాబాదు, సరూర్ నగర్ లో చేతివాటం ప్రదర్శించిన స్నాచర్లు ఇద్దరు మహిళల మెడల్లో నుంచి బంగారు చైన్లను లాగేసుకెళ్లారు. సైదాబాదు పరిధిలోని రెడ్డి కాలనీలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఓ మహిళ మెడలోని 3 తులాల బంగారాన్ని స్నాచర్లు లాక్కెళ్లారు. ఈ ఘటన జరిగిన మరికాసేపటికే సరూర్ నగర్ పరిధిలోని సాయి నగర్ లోనూ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మరో మహిళ మెడలో 4.5 తులాల బంగారు గొలుసును లాగేసుకుని వెళ్లారు. బాధితుల ఫిర్యాదులతో చైన్ స్నాచర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News