: యాగానికి వచ్చే వీఐపీలూ..ఎక్కువ మందిని తీసుకురావద్దు: హరీష్ రావు!


అయుత చండీయాగానికి వచ్చే వీఐపీలు తమ వెంట ఎక్కువ మందిని తీసుకురావద్దని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ యాగానికి వచ్చే వీఐపీలు ఎక్కువ వాహనాల్లో రావద్దని, నలుగురు లేదా ఐదుగురు కంటే ఎక్కువ మందిని తమ వెంట తీసుకురావద్దని ఆయన కోరారు. చండీయాగానికి వచ్చే భక్తులు స్వీయనియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. రాత్రి పది గంటల్లోపు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని హరీష్ రావు చెప్పారు. కాగా, అయుత చండీయాగానికి హాజరవుతున్న ఆహ్వానితులే కాకుండా సాధారణ ప్రజల సంఖ్య కూడా భారీగానే ఉంది. మీడియా సంస్థల అధినేతలు, పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, పోలీసు అధికారులు తదితరులు ఇప్పటి వరకు హాజరైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News