: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా సైకో వీరంగం!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఒక సైకో వీరంగం సృష్టించాడు. హోటల్ నుంచి వేడి వేడి చాయ్ తీసుకొచ్చి మీద పోస్తానంటూ బల్వీందర్ సింగ్ అనే సైకో ప్రజలను భయపెట్టాడు. దీంతో అతనిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఎట్టకేలకు సైకోకు దేహశుద్ధి చేసిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు.