: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ!
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువుతీరిన తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఉచిత దర్శనానికి 18 గంటలు, నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం వరకు ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకలకు, అన్న ప్రసాదానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం కేటాయిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ప్రొటోకాల్ మినహాయించి సిఫారసు ఉత్తరాలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. కాగా, పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడవాహనంపై మలయప్పస్వామి ఊరేగుతున్నారు. ఈ ఊరేగింపు మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.