: లాహోర్ లో మోదీకి ఘన స్వాగతం... ఆత్మీయ ఆలింగనం చేసుకున్న మోదీ, షరీఫ్


భారత ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ లో ల్యాండ్ అయ్యారు. లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఘన స్వాగతం పలికారు. విమానం నుంచి మోదీ కిందకు దిగగానే... ఇద్దరు ప్రధానులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం విమానాశ్రయంలోనే మోదీ సైనిక వందనం స్వీకరించారు. మోదీ రాక నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నవాజ్ షరీఫ్ జన్మదిన కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఈ రోజు షరీఫ్ ఇస్తున్న విందుకు మోదీ హాజరవుతున్నారు. ఈ క్రమంలో, విమానాశ్రయం నుంచి నవాజ్ షరీఫ్ నివాసానికి ప్రధానులిద్దరూ ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరారు.

  • Loading...

More Telugu News