: జీసస్ కు, అల్లాకు మధ్య కుస్తీ జరిగితే?... దర్శకుడు ‘వర్మ’కు క్రిస్మస్ డౌట్లు!


సినీ స్టార్లు, సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు, నేరస్తులు, పోలీసులు, ఆహార వస్తువులు... ఈవిధంగా చెప్పుకుంటూ పోతే దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లు విసిరే అంశాల జాబితా చాంతాడంత ఉంటుంది. దర్శకుడిగా వర్మ ఎంత పేరు సంపాదించుకున్నారో... పలు అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో పాప్యులర్ అయ్యాయనడం అతిశయోక్తి కాదనిపిస్తుంది. తాజాగా, క్రిస్మస్ పండుగను కూడా ఆయన వదల్లేదు. తనకు వచ్చిన డౌట్లన్నింటినీ ట్వీట్ల రూపంలో వదిలాడు. అవేమిటంటే.. * జీసస్ అందరినీ ప్రేమిస్తారనుకుంటే... ఐఎస్ఐఎస్ ను కూడా ఆయన ప్రేమిస్తారా? * ఒక వేళ జీసస్ కు, అల్లాకు మధ్య కుస్తీ జరిగితే జీససే గెలుస్తాడనుకుంటా. ఎందుకంటే, ఆయనకు కండలు అద్భుతంగా ఉంటాయి. * జీసస్ ను రోమన్లే అంత దారుణంగా చంపితే... ఆయనను ఐఎస్ఐఎస్ ఏమి చేసేదో ఆలోచించడానికే వణుకు పుడుతోంది. * క్రిస్టియన్లు అందరినీ ప్రేమిస్తారంటారు కదా, ఐఎస్ఐఎస్ నేత అబూ బకర్ ను కూడా వారు ప్రేమిస్తారా? * ఒక వేళ అబూ బకర్ నుంచి అల్ ఖైదా సభ్యుల వరకు అందరినీ జీసస్ ప్రేమిస్తే?.. అమెరికన్లు మసీదులలో వెతకడం మానేసి తమ సొంత దేవుడి విషయంలో సమీక్ష జరుపుకోరా? * మిస్టర్ జీసెస్ కు హ్యాపీ బర్త్ డే. శాంటా చాక్లెట్లు తిన్న తర్వాత ఐఎస్ఐఎస్ గురించి ఏమైనా చేయగలవేమో ఆలోచించు. నాకైతే డౌటే అంటూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News