: మూడు దశాబ్దాల తరువాత న్యాయం... 37 మందికి ఒక్కొక్కరికీ రూ. 29 కోట్ల పరిహారం!


దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన వ్యవహారంలో 37 మందికి అమెరికా ప్రభుత్వం 4.4 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 29 కోట్లు) చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. వివరాల్లోకి వెళితే, ఇరాన్ లో 1979, నవంబరులో కొంతమంది అమెరికన్ దౌత్యాధికారులను టెహ్రాన్ లోని యూఎస్ ఎంబసీలో 444 రోజుల పాటు బందీలుగా ఉంచారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నది వారిపై అప్పట్లో ఇరాన్ అభియోగాలు మోపింది. ఒక్కసారిగా ఎంబసీలోకి దూసుకెళ్లిన స్టూడెంట్ మిలిటెంట్లు, భవంతిని ఆక్రమించుకుని వారిని బందీలుగా పెట్టుకున్నారు. నిత్యమూ హింసించారు. తీవ్రంగా కొట్టేవారు. కళ్లకు గంతలు కట్టి చెట్ల మధ్య పరుగులు పెట్టించి వారు గాయపడేలా చేసి పైశాచిక ఆనందం పొందేవారు. అమెరికాలో అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన కల్పించుకోవడంతో వీరిని 1981 జనవరిలో విడుదల చేశారు. అప్పటి నుంచి వీరంతా తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో 16 మంది మరణించారు కూడా. ఇటీవల ఇరాన్, అమెరికా న్యూక్లియర్ డీల్ సందర్భంగా వీరి ప్రస్తావన రాగా, అప్పటికప్పుడు అధ్యక్షుడు ఒబామా బందీలుగా ఉన్న ఒక్కో రోజుకు 10 వేల డాలర్ల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించి సంతకాలు చేశారు. ఆనాటి బందీల ముఖాల్లో ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తున్నాయి.

  • Loading...

More Telugu News