: ఈ యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటే పనితీరు, బ్యాటరీ మటాష్!


స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తరువాత, లక్షలాది యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో చాలా వరకూ స్మార్ట్ ఫోన్ పనితీరును తగ్గించేవేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ పెర్ ఫార్మెన్స్ పై అమితంగా ప్రభావం చూపే యాప్స్ లో పలు పేరొందిన అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. యాంటీ వైరస్ సేవలను అందించే ఏవీజీ విడుదల చేసిన జాబితా ప్రకారం, ఈ యాప్స్ మీ స్మార్ట్ ఫోన్లో ఉంటే, వేగం తగ్గడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం వంటి నష్టాలుంటాయి. అవి ఏంటంటే... ప్రాసెసర్ వేగాన్ని తగ్గించే టాప్-10 యాప్స్: ఫేస్ బుక్, గూగుల్ ప్లే స్టోర్, బీబీఎం, ఇన్ స్టాగ్రామ్, మెసింజర్, శాంసంగ్ చాట్ ఆన్, ఫేస్ బుక్ పేజస్ మేనేజర్, ది వెదర్ చానల్, కకావో టాక్. (ఇవన్నీ ఫోన్ ఆన్ చేయగానే ఆటో రన్ లోకి వెళ్లిపోతాయి) యూజర్ ఆన్ చేయడం ద్వారా పనితీరుపై ప్రభావితం చూపే యాప్స్: స్నాప్ చాట్, అమేజాన్ షాపింగ్ యూకే, స్పూటిఫై మ్యూజిక్, లైన్, క్లీన్ మాస్టర్, శాంసంగ్ వాచ్ ఆన్, నెట్ ఫ్లిక్స్, బీబీసీ న్యూస్, అమేజాన్ షాపింగ్ (గ్లోబల్). బ్యాటరీని త్వరగా ఖతం చేసే యాప్స్: ఆండ్రాయిడ్ ఫిర్మ్ వేర్ అప్ డేటర్, బీమింగ్ సర్వీస్ ఫర్ శాంసంగ్, శాంసంగ్ సెక్యూరిటీ పాలసీ అప్ డేటర్, శాంసంగ్ చాట్ ఆన్, గూగుల్ ప్లే సర్వీసెస్, ఫేస్ బుక్, బీబీఎం, వాట్స్ యాప్ మెసింజర్, వెదర్ అండ్ క్లాక్ విడ్జట్ ఆండ్రాయిడ్. (ఇవన్నీ ఫోన్ ఆన్ చేయగానే ఆటో రన్ లోకి వెళ్లిపోతాయి) యూజర్ ఆన్ చేయడం ద్వారా బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గించే యాప్స్: శాంసంగ్ వాచ్ ఆన్, స్నాప్ చాట్, అమేజాన్ షాపింగ్ యూకే, మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్, బీబీసీ న్యూస్, నెట్ ఫ్లిక్స్, లైన్, క్లీన్ మాస్టర్, వాల్ మార్ట్. అధిక మెమొరీని తినేసే యాప్స్: ఫేస్ బుక్, అమేజాన్ కిండెల్, ఎస్పీ-మోడ్ మెయిల్, ఫేస్ బుక్ పేజస్ మేనేజర్, గూగుల్ ప్లే సర్వీసెస్, స్కైపీ, ఇన్ స్టాగ్రామ్, టాంగో, గూగుల్ (సెర్చ్) (ఇవన్నీ ఫోన్ ఆన్ చేయగానే ఆటో రన్ లోకి వెళ్లిపోతాయి) యూజర్ ఆన్ చేయడం ద్వారా అధిక మెమొరీని తినేసే యాప్స్: స్పూటిఫై మ్యూజిక్, క్రోమ్, అల్లీస్, లైన్, ఆమేజాన్ షాపింగ్ యూకే, ట్రిప్ అడ్వయిజర్, అమేజాన్ షాపింగ్ గ్లోబల్, స్నాప్ చాట్, క్లీన్ మాస్టర్. పనితీరును దెబ్బతీసే గేమింగ్ యాప్స్: క్లాష్ ఆఫ్ టైటాన్స్, క్యాండీ క్రష్ సాగా, ఫార్మ్ హీరోస్ సాగా, క్యాండీ క్రష్ సోడా సాగా, 8 బాల్ పూల్, మై టాకింగ్ ఏంజిలా, డోంట్ టాప్ ది వైట్ టైల్, డిస్పెకబుల్ మీ, మై టాకింగ్ టామ్.

  • Loading...

More Telugu News