: పుదుచ్చేరీలో ఆకట్టుకుంటున్న కలాం చాక్లెట్ విగ్రహం


పుదుచ్చేరీలోని ఓ చాక్లెట్ బొటిక్ కలాంకు నివాళిగా సరికొత్త ప్రయత్నం చేసింది. చాక్లెట్ తో 5 అడుగుల కలాం విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించింది. పుద్దుచ్చేరీకి చెందిన జుకా అనే చాక్లెట్ బొటిక్ తమ షాపు వార్షికోత్సవం సందర్భంగా ఇలా కలాం చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసింది. దాదాపు 4000 కిలోల నాణ్యమైన చాక్లెట్ ను ఉపయోగించి 5 అడుగుల 11 అంగుళాల కలాం నిలువెత్తు రూపాన్ని తీర్చిదిద్దింది. దాంతో దీనిని చూసేందుకు భారీగా జనం వస్తున్నారు. విగ్రహాన్ని తయారు చేసేందుకు 180 గంటలు పట్టిందని షాపు యజమాన్ని శ్రీనాథ్ బాలచంద్రన్ తెలిపారు. ఈ విగ్రహాన్ని కొత్త సంవత్సరం వరకు ప్రదర్శనకు ఉంచనున్నట్టు తెలిపారు. గతంలో తమ షాపు వార్షికోత్సవాల్లో మహాత్మాగాంధీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, మిక్కీ మౌస్ తదితర విగ్రహాలను చాక్లెట్ తో రూపొందించామని వివరించారు.

  • Loading...

More Telugu News