: ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించిన మోదీ
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. నూతన భవనానికి అటల్ బ్లాకుగా నామకరణం చేశారు. భారత్ రూ.710 కోట్ల ఖర్చుతో ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉభయసభలున్న ఈ భవనంలో దిగువ సభలో 29 సీట్ల సామర్థ్యం ఉంటే, ఎగువ సభ సామర్థ్యం 192 సీట్లు. అంతకుముందే ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. దానికిముందుగా అధ్యక్ష భవనంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాగతం పలికిన ఘనీని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.