: ‘యే షహర్ హమారా... మేయర్ హమారా’’: గ్రేటర్ బరిలో మజ్లిస్ నినాదం


హైదరాబాదు మేయర్ పీఠం మళ్లీ తమదేనని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. నిన్న ఓల్డ్ సిటీలోని పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో జరిగిన మిలాద్ సమావేశంలో భాగంగా మాట్లాడిన ఒవైసీ ఉద్రేకపూరితంగా ప్రసంగించారు. బల్దియా ఎన్నికల్లో 70 నుంచి 75 సీట్లలో పోటీ చేయనున్నామని ప్రకటించిన ఒవైసీ, మెజారిటీ సీట్లలో తమదే విజయమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు గత చరిత్ర మరిచి మాట్లాడుతున్నారని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా, ఆ పార్టీ అడ్రెస్ గల్లంతు కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ‘‘యే షహర్ హమారా...మేయర్ హమారా’’ అన్న నినాదంతోనే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News