: తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూత


తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గతంలో మంత్రిగా విధులను నిర్వహించిన మెట్ల సత్యనారాయణ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1996 నుంచి 99 మధ్య కాలంలో చంద్రబాబు క్యాబినెట్ లో మెట్ల ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవలే ఆయన్ను చంద్రబాబు తదితర తెలుగుదేశం నేతలు పరామర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల పార్టీ కమిటీలను తెలుగుదేశం ప్రకటించినప్పుడు ఆయనకు ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిన విషయం విదితమే. మెట్ల మృతిపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన మృతదేహాన్ని అమలాపురం తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News