: నేను పెరిగిన ఇండియా ఇది కాదు: ప్రియాంకా చోప్రా సంచలన వ్యాఖ్యలు
తన తాజా చిత్రం 'బాజీరావు మస్తానీ' విజయంతో ఆనందంగా ఉన్న ప్రియాంకా చోప్రా, ఇండియాలో అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను పెరిగిన ఇండియా ఇది కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఆమెపై విమర్శలకు దారితీసింది. సినిమా నటులను రాజకీయాల్లో పావులుగా వాడుకోవడం తగదని అంటోంది. "నేను ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను. నేను పెరిగిన ఇండియా ఇది కాదు. ఇప్పుడు ప్రతి విషయమూ రాజకీయమవుతోంది" అని తెలిపింది. సినిమాలకూ, రాజకీయాలకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పింది.