: ఆంధ్రప్రదేశ్ లో రెండు అణు విద్యుత్ కేంద్రాలు!


ఇండియాలో మొత్తం 12 అణు విద్యుత్ కేంద్రాలను రష్యా సహకారంతో ఏర్పాటు చేయనుండగా, అందులో రెండు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో మొత్తం 16 ఒప్పందాలు కుదరగా, రష్యాకు చెందిన కమోవ్‌ 226 టీ హెలికాప్టర్ల ప్లాంటు, రూ.40 వేల కోట్లతో ఎస్‌-400 ట్రిముఫ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైల్‌ సిస్టమ్స్‌ కొనుగోలు ఒప్పందాలు కీలకమైనవి. 2015లోగా ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఇప్పుడున్న రూ. 60 వేల కోట్ల నుంచి మూడు రెట్లు పెంచి రూ. 1.8 లక్షల కోట్లకు చేర్చే అవకాశాలపైనా ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. ఇండియాతో ఆర్థిక బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలన్న తన ఆకాంక్షను పుతిన్ వెల్లడించగా, రష్యా తమకు దీర్ఘకాల మిత్ర దేశమని మోదీ కొనియాడారు.

  • Loading...

More Telugu News