: గూగుల్ సెర్చ్ లోనూ ‘బాహుబలి’ సత్తా!... క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత స్థానంలో జక్కన్న చిత్రం


తెలుగు చిత్రసీమ రికార్డులతో పాటు భారతీయ చలనచిత్ర రికార్డులను చెరిపేసిన జక్కన్నగా పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన చిత్రరాజం ‘బాహుబలి’ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. గడచిన ఏడాది కాలంలో భారత్ లో అత్యధిక మంది గూగుల్ లో సెర్చ్ చేసిన వాటిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక ‘బాహుబలి’ కంటే ముందు ఐసీసీ వరల్డ్ కప్-2015 ఒక్కటి మాత్రమే ఉంది. బాలీవుడ్ హిట్ చిత్రాలు భజరంగీ భాయ్ జాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏబీసీడీ-2, ఐ చిత్రాలన్నీ బాహుబలి తర్వాతి స్థానాలతోనే సరిపెట్టుకున్నాయి. ఇక టాప్ మోస్ట్ సెర్చ్ స్టార్లలో అందరినీ వెనక్కు నెట్టేస్తూ సన్నీ లియోన్ అగ్రస్థానంలో నిలిచింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే తదితరులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. క్రీడాకారుల్లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రథమ స్థానంలో నిలవగా... ఆ తర్వాతి స్థానాల్లో మెస్సీ, సచిన్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తదితరులున్నారు.

  • Loading...

More Telugu News