: డి-కంపెనీ సీఈఓ అయ్యేది ఎవరు?


దావూద్ ఇబ్రహీం తన మాఫియా సామ్రాజ్యానికి వారసుడిగా ఎవరిని ప్రకటిస్తాడు? అంటే .. ఇద్దరి వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఒకరు.. దావూద్ కు నమ్మిన బంటుగా ఉన్న చోటా షకీల్. మరొకరు.. దావూద్ తమ్ముడు అనీస్ అహ్మద్. చోటా షకీల్ తో కలిసి డి-కంపెనీ వ్యవహారాలను అనీస్ కూడా చూస్తూ ఉంటాడు. కనుక, వాళ్లిద్దరిలో ఎవరిని డి-కంపెనీ సీఈఓగా దావూద్ ప్రకటిస్తాడనే విషయం అంతుబట్టని వ్యవహారమే. కాగా, వచ్చే శనివారం నాడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తన 60వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నాడు. పాకిస్థాన్ లోని ఒక హోటల్ లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News