: బంగ్లాదేశ్ లోని ‘పాక్’ మహిళా దౌత్యవేత్త రీ కాల్... 'ఉగ్ర'లింకులే కారణం!


ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మహిళా దౌత్యవేత్త ఫరీనా అర్షద్ ను బంగ్లాదేశ్ నుంచి వెనక్కి పిలిపించారు. ఈ విషయాన్ని ‘బంగ్లా’ అధికారులు వెల్లడించారు. ఢాకాలోని పాక్ హైకమిషన్‌లోని రాజకీయ విభాగంలో సెకండ్ సెక్రటరీగా అర్షద్ పనిచేస్తున్నారు. కాగా, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) అనే సంస్థకు చెందిన ఇద్రిస్ అనే ఉగ్రవాదిని పట్టుకుని విచారణ నిర్వహిస్తున్న సమయంలో అర్షద్ కు ‘ఉగ్ర’ లింకులు ఉన్నాయన్న విషయం బయటపడింది. అర్షద్ తో కలిసి తాను కారులో ప్రయాణించానని, తనకు ‘బంగ్లా’ కరెన్సీ కూడా ఆమె ఇచ్చిందని, గత రెండేళ్లలో ఇక్కడి నుంచి పాకిస్థాన్ కు సుమారు 48 సార్లు తిరిగానని పోలీసుల విచారణలో ఇద్రిస్ పేర్కొన్నాడు. కాగా, తమ దేశంలో పనిచేస్తున్న పాకిస్తాన్ మహిళా దౌత్యవేత్త ఉగ్రవాది అంటూ బంగ్లాదేశ్ అధికారులు ఇటీవల ఆరోపించారు.

  • Loading...

More Telugu News