: గచ్చిబౌలి స్టేడియంలో ‘జగదేకవీరుడు- అతిలోకసుందరి’ స్పెషల్ షో!


సుమారు 26 సంవత్సరాల క్రితం విడుదలైన జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రం ఎంతటి సంచలన విజయం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా నటించిన ఆ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించి, కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. 'ఈ చిత్రాన్ని మళ్లీ చూడండి' అంటున్నారు ఆ సినిమా దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలంటూ చిరంజీవి అభిమానుల నుంచి ఈ చిత్ర దర్శక, నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వనీదత్ లకు పలు విజ్ఞప్తులు అందాయి. ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్రరావు తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. దాంతో థియేటర్లకు బదులుగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న స్కై ఫెస్ట్-2015 లో రేపు (శుక్రవారం) జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, కేన్సర్ బాధితుల సహాయార్థం ఈ చిత్రాన్ని నిర్వహిస్తున్నామని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కోరారు.

  • Loading...

More Telugu News