: టెక్ మహీంద్రా నుంచి... తొలి 'ఎన్ఎఫ్ సీ' ఆధారిత డిజిటల్ వాలెట్ యాప్


భారత మార్కెట్ లోకి తొలి డిజిటల్ వాలెట్ యాప్ విడుదలైంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టెక్ మహీంద్రా దేశంలోనే మొదటి ఎన్ ఎఫ్ సీ (నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్) ఆధారిత డిజిటల్ పేమెంట్ యాప్ ని తీసుకొచ్చింది. 'మొబోమనీ' (MOBOMONEY) పేరుతో తాజాగా ఆ యాప్ ను విడుదల చేసింది. ఎన్ ఎఫ్ సీ రేడియో కమ్యూనికేషన్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ను... 2 ఎన్ ఎఫ్ సీ ఆధారిత డివైస్ ల మధ్య వినియోగించవచ్చు. మన వెంట డబ్బు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రీపెయిడ్ పద్ధతిలో ఈ యాప్ లో క్యాష్ ను లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు రిటెయిల్ ఔట్ లెట్లలో క్యాష్ లోడింగ్ సదుపాయాన్ని సంబంధిత సంస్థ ప్రతినిధులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తోంది. త్వరలో ఇతర ప్లాట్ ఫాంలపై కూడా దీనిని అందుబాటులోకి తేనున్నారు.

  • Loading...

More Telugu News