: ముంబై గజగజ!... రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు


దేశ వాణిజ్య రాజధాని ముంబై మహా నగరం నిన్న రాత్రి చలితో గజగజ వణికిపోయింది. నగరంలో వేగంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు నిన్న రాత్రి 11.6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. దీంతో నగరంలోని మెజారిటీ ప్రాంతాల ప్రజలు వణికించిన చలితో ఉదయం తెల్లవారినా ముసుగులు తీయలేకపోయారు. ఈ స్థాయిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమమట. ఇక పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతగా నిన్న 28.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరో రెండు రోజుల పాటు ఇదే తరహాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News