: జమ్ము కశ్మీర్ సీఎంకు అస్వస్థత... ఎయిమ్స్ కు తరలింపు
జమ్ము కశ్మీర్ సీఎం ముప్తీ మహ్మద్ సయీద్(79) ఇవాళ ఉదయం తన నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ఢిల్లీకి తరలించారు. రాజధానిలోని ఎయిమ్స్ లో చేర్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో మార్చిలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.