: బిజినెస్ మ్యాన్ గా భజ్జీ!... శ్రీలంకలో పెట్టుబడులకు సన్నాహాలు


టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ ఇటీవలే పెళ్లి చేసుకుని గృహస్తాశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే వ్యాపార రంగంలోకి కూడా ప్రవేశించేందుకు అతడు పక్కా పథక రచన చేస్తున్నాడు. అంతేకాదండోయ్, వ్యాపారంలో ఇప్పటిదాకా ఎవరూ అనుసరించని కొత్త విధానాలతో అతడు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పొరుగు దేశం శ్రీలంకలోని వ్యాపార అనుకూల అంశాలపై ఆరా తీసిన భజ్జీ, అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ మేరకు భజ్జీ పెట్టుబడులపై సాక్షాత్తు శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి రవి కరుణనాయకే నిన్న ఓ ప్రటకన చేశారు. తమ దేశంలో భజ్జీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో భజ్జీ తమ దేశంలో పెట్టుబడులు పెడుతున్నాడని కరుణనాయకే పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News