: మతం మార్చుకున్న వారికీ ఎస్సీ రిజర్వేషన్: చంద్రబాబు


మతం మార్చుకునే దళితులకుకూడా ఎస్సీ రిజర్వేషన్లను వర్తింపచేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పలువురు మంత్రులతో కలసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, మత సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అన్యాక్రాంతమవుతున్న క్రిస్టియన్ సంస్థల ఆస్తులను కాపాడే బాధ్యతలను ఆయా సంస్థలే చేపట్టాలని, అందుకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని అన్నారు. ఈ మేరకు మంత్రివర్గ సబ్ కమిటీని వేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులను కలిగివున్న క్రైస్తవులందరికీ, 'చంద్రన్న క్రిస్మస్ కానుక' నేటి సాయంత్రంలోగా అందుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News