: బంపరాఫర్... రూ. 3 వేలలోపే విదేశీ ప్రయాణానికి విమాన టికెట్


ఈ క్రిస్మస్ సీజనులో విమాన ప్రయాణికులకు మరింతగా దగ్గర కావాలని భావిస్తున్న ఎయిర్ ఆసియా ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. విదేశాలకు టికెట్లను రూ. 2,999 (అన్ని పన్నులూ కలుపుకుని)కే అందిస్తామని ప్రకటించింది. క్రిస్మస్ సేల్ లో భాగంగా జనవరి 3 వరకూ ఆఫర్లు లభిస్తాయని, ఆపై 4 నుంచి జూన్ 30 వరకూ ప్రయాణాలు చేయవచ్చని తెలిపింది. తిరుచిరాపల్లి, కొచ్చి ల నుంచి కౌలాలంపూర్ కు రూ. 2,999, గోవా నుంచి రూ. 4,999, చెన్నై నుంచి రూ. 5,399, విశాఖపట్నం నుంచి రూ. 3,699, కోల్ కతా నుంచి బ్యాంకాక్ కు రూ. 9,562కు లభిస్తాయని పేర్కొంది. ఇటీవల మరో లోకాస్ట్ ఎయిర్ వేస్ సంస్థ గో ఎయిర్ రూ. 603కు క్రిస్మస్ టికెట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, గడచిన నవంబరులో దేశవాళీ విమాన ప్రయాణికుల సంఖ్య 2014తో పోలిస్తే 24.65 శాతం పెరిగింది. మొత్తం 73.20 లక్షల మందికి పైగా విమానాల్లో ప్రయాణించారు.

  • Loading...

More Telugu News