: మరో వివాదంలో మోదీ... జాతీయ గీతాలాపన సమయంలో నడిచి వెళ్లిన ప్రధాని


ప్రధాని నరేంద్ర మోదీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రష్యా పర్యటన సందర్భంగా నిన్న మాస్కోలో ల్యాండైన మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ నిబంధనల మేరకు రష్యా అధికారులు భారత జాతీయ గీతం ‘జనగణ మన...’ను ప్లే చేశారు. అయితే ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని మోదీ గీతం ప్లే అవుతుండగానే నడిచి ముందుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన రష్యాకు చెందిన ఓ అధికారి ఆయన చేతిని పట్టి ఆపారు. అంతేకాక మోదీని వెనక్కు తీసుకెళ్లిన సదరు అధికారి నిర్దేశిత స్థలంలో మోదీని నిలిపారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపనకు వందనం సమర్పిస్తూ మోదీ అక్కడ అటెన్షన్ లో నిలబడ్డారు. విదేశీ గడ్డపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై విపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ గీతాలాపన సమయంలో మోదీ నడిచి వెళ్లి జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News