: ఎంపీ కీర్తి ఆజాద్ పై వేటు... బీజేపీ నుంచి సస్పెన్షన్!


సొంత పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ పై బీజేపీ వేటు వేసింది. పార్టీ నుంచి ఆజాద్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వ్యవహారంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసిన కారణంగానే ఆయనపై ఈ వేటు పడినట్లు సమాచారం. కాగా, డీడీసీఏ నిధుల దుర్వినియోగానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని ఆరోపిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. దీంతో బీజేపీ, ఆప్ నేతల మధ్య వైరం మరింత పెరిగిపోయింది. అయితే, జైట్లీపై వచ్చిన ఆరోపణలకు సొంత పార్టీ ఎంపీ కీర్తి కూడా వంత పాడటంతో బీజేపీ అధిష్ఠానం మండిపడటం విదితమే.

  • Loading...

More Telugu News