: ధోనీ రాణించినా... గంభీర్ చేతిలో ఓటమి!
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టును టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ జట్టు చిత్తుచేసింది. సుదీర్ఘ విరామం తరువాత జార్ఖండ్ జట్టు తరపున ధోనీ రంజీల్లో ఆడుతున్నాడు. టీమిండియా పేసర్ వరుణ్ ఆరోన్ నాయకత్వంలోని జార్ఖండ్ జట్టులో ధోనీ ప్రధాన ఆటగాడు. జార్ఖండ్, ఢిల్లీ జట్ల మధ్య బెంగళూరులో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 226 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జార్ఖండ్ జట్టు కేవలం 38 ఓవర్లలోనే పెవిలియన్ చేరింది. ధోనీ (70) రాణించినా అతనికి సహకారమందించే ఆటగాడే కరవయ్యాడు. దీంతో ఢిల్లీ చేతిలో జార్ఖండ్ 99 పరుగులు భారీ తేడాతో పరాజయం పాలైంది.