: అలాంటి విలువలైనా ఏపీ అసెంబ్లీకి ఉన్నాయా?: సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు


వివిధ పార్టీలపై తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేసే సీపీఐ నేత నారాయణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పలు అంశాలపై స్పందించారు. వ్యభిచార కొంపలకు ఉన్న పాలసీల్లాంటివైనా అసెంబ్లీకి ఉన్నాయా? లేవా? అని ఏపీ అసెంబ్లీ జరిగిన తీరును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిజాయతీ పరులైన అధికారులను శిక్షిస్తూ, రౌడీలకు కొమ్ముకాస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించారు. బూతులు మాట్లాడే రోజాలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం దురదృష్టం అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరిపేందుకు గిరిజనుల్లో చీలిక తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం అంటే గనులను ధారాదత్తం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అయుత చండీయాగం పేరిట నెయ్యిని వృథా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం యాగం చేసి ఉంటే వెయ్యిమంది బతికి ఉండేవారని ఆయన సెటైర్ వేశారు.

  • Loading...

More Telugu News