: సల్మాన్ కేసు.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ‘మహా’ ప్రభుత్వం


హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్దోషి అంటూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సల్మాన్, ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆనందోత్సాహాలతో స్వీట్లు కూడా పంచుకున్నారు. ఆ సంతోషంపై నీళ్లు చల్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటపడడాన్ని సవాల్ చేస్తూ ‘మహా’ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఒక పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. సుమారు పదమూడు సంవత్సరాల పాటు ఈ కేసు కొనసాగింది. సల్మాన్ నిందితుడు అని చెప్పడానికి సరైన సాక్ష్యాధారాలు ప్రాసిక్యూషన్ చూపించలేకపోవడంతో అతన్ని నిర్దోషి అని ఈ నెల 10 వ తేదీన బాంబే హైకోర్టు తీర్పు నిచ్చింది. కాగా, దీనిపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా, బాధితుల కుటుంబసభ్యులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తప్పతాగి కారు నడిపిన సల్మాన్ ఖాన్ దోషి కాకపోతే, మరెవరు? అంటూ పలువురు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News