: కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు కేటీఆర్ ఎలా శంకుస్థాపన చేస్తారు?: కిషన్ రెడ్డి


తెలంగాణ కోసం అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు మంత్రి కేటీఆర్ ఎలా శంకుస్థాపన చేస్తారని మండిపడ్డారు. అయుత చండీయాగానికి ప్రధాని నరేంద్ర మోదీని ఇంత వరకు ఆహ్వానించలేదని అన్నారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మోదీపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని, మోదీని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ కు లేదని అన్నారు. టీఆర్ఎస్ దయాదాక్షిణ్యాలతో బీజేపీ అధికారంలోకి రాలేదన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News