: బాల నేరస్థుడి విడుదలను అంగీకరించను: ప్రియాంకా చోప్రా
నిర్భయ కేసులో బాలనేరస్థుడి విడుదలకు తాను మద్దతివ్వనని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తెలిపింది. 'జై గంగాజల్' సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా దీనిపై ముంబైలో మాట్లాడుతూ, అతను చేసిన దుశ్చర్య అత్యంత క్రూరమైనదని, క్షమించరాని నేరం చేసిన అతను విడుదలకు అనర్హుడని పేర్కొంది. న్యాయ వ్యవస్థకు గౌరవం ఇస్తానని, చట్టానికి లోబడే నడుచుకుంటానని తెలిపిన ఆమె, నిర్భయ ఘటనలో బాల నేరస్థుడి దుశ్ఛర్య అత్యంత హేయమైందని చెప్పింది. బాలుడన్న కారణంతో నామమాత్రపు శిక్షతో అతడిని స్వేచ్ఛగా వదిలేయడం సరికాదని ప్రియాంక అభిప్రాయపడింది.