: ఇకపై వాట్స్ యాప్ లో త్వరలో వీడియో కాలింగ్ సౌకర్యం


ఇకపై వాట్స్ యాప్ లో వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన వాట్స్ యాప్ లో మెసేజింగ్, కాలింగ్ సౌకర్యం ఉంది. అయితే స్కైప్, హ్యాంగవుట్స్ లా వీడియో కాలింగ్ సౌకర్యం లేకపోవడంతో దీనికి లభించాల్సినంత ఆదరణ లభించడం లేదని పలువురు అభిప్రాయపడేవారు. ఆ లోటును భర్తీ చేస్తూ వాట్స్ యాప్ లో వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు నడుస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని, త్వరలో విడుదల చేయనున్న ఐవోఎస్ వెర్షన్ లో ఈ సౌకర్యం కల్పించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. వీడియో కాల్ మాట్లాడుతూనే ఫోటోలు కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి జర్మనీలో దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ నడుస్తోందని జర్మన్ వెబ్ సైట్ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆ వెబ్ సైట్ విడుదల చేసింది.

  • Loading...

More Telugu News