: ఐసీసీ అవార్డులను ఎగరేసుకుపోయిన స్మిత్... టీమిండియా క్రికెటర్లకు ఒక్కటీ దక్కని వైనం


ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏటా ప్రకటిస్తున్న వార్షిక అవార్డుల జాబితాలో ఈ ఏడాది టీమిండియా క్రికెటర్లకు షాక్ తగిలింది. ప్రపంచంలోనే మేటి క్రికెటర్లున్న టీమిండియాలోని ఏ ఒక్క క్రికెటర్ కూడా ఈ ఏడాది ఐసీసీ అవార్డు దక్కించుకోలేకపోయాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సర్ గ్యారీసోబర్స్ ట్రోఫీని కూడా ఎగరేసుకుపోయాడు. ఇక అన్ని ఫార్మాట్లలో తన బ్యాటుతో వీర విహారం చేస్తున్న సఫారీ సూపర్ స్టార్, దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ‘స్పిరిట్ ఆప్ ది క్రికెటర్’ అవార్డును చేజిక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News