: జైట్లీ ఇంటి ముందు ఆప్ నిరసన... ఢిల్లీలో ఉద్రిక్తత


డీడీసీఏ అవకతవకలకు సంబంధించిన ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇంటి ముందు నేటి ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీడీసీఏ వ్యవహారంపై దర్యాప్తు ముగిసేదాకా జైట్లీ కేంద్ర మంత్రి పదవికి దూరంగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైట్లీ ఇంటి వద్దకు వస్తున్నారన్న సమాచారం కాస్తంత లేటుగా అందుకున్న పోలీసులు ఆందోళనకారులను తుగ్లక్ రోడ్డులోనే అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించిన ఆప్ కార్యకర్తలు జైట్లీ ఇంటి వద్దకు దూసుకువచ్చారు. దీంతో వారిని నిలువరించేందుకు పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. ప్రస్తుతం అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News