: స్పీకర్ పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైకాపా
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ ఉదయం 11 గంటలకు ఏపీ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణను కలిసిన వైకాపా నేతలు నోటీసును అందజేశారు. వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, పక్షపాతంతో వ్యవహరిస్తూ, ప్రతిపక్ష నేత జగన్ కు కనీసం మైక్ కూడా ఇవ్వడం లేదని వైకాపా నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో, వైకాపా ఇచ్చిన నోటీసును పరిశీలిస్తామని అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు. గతంలో కూడా స్పీకర్ పై వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. అయితే, కొందరు పెద్దల సూచనతో తీర్మానాన్ని ఉపసంహరించుకుంది.