: కేజ్రీపై రాజద్రోహం దావా... మోదీని పిరికిపంద, సైకోగా అభివర్ణించడమే నేపథ్యం!


తన కార్యాలయంలోని ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ అవినీతి భాగోతం పేరిట జరిగిన సీబీఐ సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరింత విపత్కర పరిస్థితిని ఎదుర్కోనున్నారు. ఇప్పటికే డీడీసీఏ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై పరువునష్టం దావా దాఖలైంది. తాజాగా ఢిల్లీకి చెందిన న్యాయవాది ప్రదీప్ కుమార్ ద్వివేదీ... కేజ్రీపై మరో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. తీస్ హజారీ కోర్టులో దాఖలైన ఈ పిటిషన్ వచ్చే నెల 4న విచారణకు రానుంది. తన కార్యాలయంపై సీబీఐ దాడులను నిరసిస్తూ ఈ నెల 15న ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలను పోస్ట్ చేసిన కేజ్రీవాల్... ప్రధాని నరేంద్ర మోదీని పిరికిపందగానే కాక సైకోగానూ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన ప్రదీప్ కుమార్... కేజ్రీవాల్ పై రాజద్రోహం, పరువునష్టం ఆరోపణల కింద విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News