: దాయాదుల పోరు కార్యరూపం దాల్చాలని అంతా కోరుకుంటున్నారు: గంగూలీ కామెంట్
ప్రపంచ క్రికెట్ లో దాయాదుల పోరుగా వినుతికెక్కిన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా అతడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయని కూడా అతడు పేర్కొన్నాడు. అయితే దాయాదుల పోరు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే విషయంలో ఇరు దేశాల బోర్డుల పాత్ర ఉందని గంగూలీ అన్నాడు. ఈ విషయంలో ఒక్క బీసీసీఐ మాత్రం ఏమీ చేయలేదని కూడా అతడు పేర్కొన్నాడు.