: ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలి: కేజ్రీవాల్


ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, డీడీసీఏలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని వివరించారు. కేవలం జైట్లీని రక్షించేందుకే సీబీఐతో కేంద్రం దాడులు చేయిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఫ్లాప్ రైడ్స్ కు బాధ్యత వహిస్తూ మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ మర్చిపోయారని ఆయన పేర్కొన్నారు. అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ, సీబీఐతో దాడులు చేయించి, సంబంధిత పత్రాలను తీసుకుపోయి జైట్లీని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ విదేశీ పర్యటనలపై కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News