: అభ్యంతరకర ఫోటోలు పోస్టు చేయవద్దని చెబుతున్న బాలీవుడ్ నటి
కెనడాలో శృంగార తారగా వెలుగొంది, బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ తన ట్విట్టర్ ఖాతాలో అసభ్య ఫోటోలు పోస్టు చేయవద్దని చెబుతోంది. ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఆమె ఏదయినా ఫోటో పోస్టు చేస్తే...రసజ్ఞులైన ఆమె అభిమానులు, గతంలో విదేశాల్లో ఆమె పనిచేసిన రంగంలో తీసుకున్న ఫోటోలను దానికి ట్యాగ్ చేస్తూ పోస్టు చేస్తున్నారు. దీంతో అమ్మడు చాలా హర్టవుతోంది. తనకు అలాంటి ఫోటోలు, వ్యాఖ్యలు పోస్టు చేయవద్దని సూచిస్తోంది. ట్విట్టర్లో బ్లాక్ అనే ఆప్షన్ ను తన కోసమే పెట్టినట్టున్నారని, బాలీవుడ్ లో అత్యధిక మందిని బ్లాక్ చేసిన నటిని తానేనని చెబుతోంది. తన ఫాలోవర్ల లిస్టుతోపాటు బ్లాక్ చేసిన మెంబర్ల లిస్టు కూడా పెద్దదని ఆమె తెలిపింది.