: స్వచ్ఛభారత్ పన్నుతో 329.6 కోట్లు సమకూరాయన్న కేంద్రం


స్వచ్ఛ భారత్ పన్ను విధించడం వల్ల కేంద్ర ఖజానాకు ఇంతవరకు 329.6 కోట్ల రూపాయలు సమకూరాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. స్వచ్ఛభారత్ పన్ను వల్ల కేంద్రానికి సమకూరిన ఆదాయ వివరాలు తెలపాలంటూ పార్లమెంటు సభ్యులు అడిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. స్వచ్ఛ భారత్ సుంకం పేరుతో నవంబర్ 15 నుంచి సెస్ వసూలు చేస్తోందని, ఇంత వరకు 329.6 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నవంబర్ 15 నుంచి 2016 మార్చి 31 లోపు 3,750 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఆదాయాన్ని స్వచ్ఛభారత్ నిమిత్తం రాష్ట్రాలకు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News