: మోదీ ప్రేరణతో సర్పంచ్ అయిన చాయ్ వాలీ


చాయ్ వాలాగా ఉన్న నరేంద్ర మోదీ ఏకంగా భారత ప్రధానమంత్రి అయ్యారు. ఆయనను ప్రేరణగా తీసుకున్న ఓ చాయ్ వాలీ సర్పంచ్ అయింది. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని నాగ్లా కరన్ గ్రామస్తురాలైన పూజ కుమారి చాయ్ అమ్ముతూ జీవనోపాధి పొందుతోంది. ఇటీవల జరిగిన గ్రామ్ ప్రధాన్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె 111 ఓట్లతో గెలుపొంది సర్పంచ్ గా ఎన్నికయింది. మొత్తం 16 గ్రామాలకు ఆమె సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్పంచ్ గా ఎన్నికవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ప్రధాని మోదీనే తనకు ప్రేరణ అని చెప్పారు. మోదీ ప్రసంగాలు విని తాను ఎంతో నేర్చుకున్నానని, తన విజయం వెనుక భర్త సహకారం కూడా ఎంతో ఉందని అన్నారు. పెళ్లయిన తర్వాత తన భర్తతో కలసి టీ అమ్మే క్రమంలో ప్రజలతో పరిచయాలు ఎక్కువయ్యాయని... అప్పుడే తనకు ప్రజల కష్టాల గురించి తెలిసిందని చెప్పారు. మరో విషయం ఏమిటంటే, పూజ కుమారి బీఈడీ చదివారు.

  • Loading...

More Telugu News