: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దాంతో సభ నిరవధికంగా వాయిదాపడింది. మొత్తం ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగాయని, 8 బిల్లులుకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. 26 గంటల 8 నిమిషాల పాటు సభ జరగగా, 49 ప్రశ్నలపై సభలో చర్చ జరిగిందని తెలిపారు. అయితే చర్చకు రాని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని మంత్రులను స్పీకర్ ఆదేశించారు. చివరగా స్పీకర్, సీఎం చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సభలో చివరిరోజు బాక్సైట్ తవ్వకాల అంశంపై చర్చించారు.