: అల్లుడికి ఆడీ కారు...వియ్యంకులకు ఫార్చ్యూనర్ కారు... మోటార్ బైకులు!


స్థాయిని బట్టి ఈ రోజుల్లో పెళ్లిళ్లు అంతా ఘనంగానే నిర్వహిస్తున్నారు. కలవారింట పెళ్ళిళ్ళయితే మరీ ఘనంగా, వెరైటీగా జరుగుతున్నాయి. ఇటీవల అటువంటి ఘనమైన పెళ్లి వేడుక ఒకటి మహారాష్ట్రలో జరిగింది. పూణే సమీపంలోని పింప్రి చింత్వాడ్ ప్రాంతంలో ఈ వివాహం జరిగింది. అనంతరం రిసెప్షన్ సందర్భంగా పెండ్లి కుమార్తె తండ్రి అల్లుడికి ఆడీ కారు బహూకరించారు. అంతటితో ఆగని ఆయన వియ్యంకులకు ఫార్చ్యూనర్ కారు, 12 రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు బహుమతిగా అందజేశారు. ఈ వేడుకలో అల్లుడికి హారతులు పట్టిన బంధువుకు యాక్టివా హోడా అందజేశారు. ఇంకొందరు సమీప బంధువులకు బంగారు ఉంగరాలను బహుమతులుగా అందజేశారట. ఈ లెక్కన ఈ వివాహం కుదిర్చిన వారికి ఏమిచ్చి ఉంటారో? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News