: టీడీపీలో చేరిన ప్రకాశం జిల్లా వైసీపీ నేత నూకసాని బాలాజి
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నూకసాని బాలాజి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడుగా ఉన్న నూకసాని, గతంలో ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.