: విదేశీ విద్యార్థినిపై జేఎన్ యూ ఫ్రొఫెసర్ వేధింపులు...ఉద్యోగం పీకిపారేసిన వర్సిటీ


ఉన్నత విద్యాభ్యాసం కోసం భారత్ వచ్చిన బంగ్లాదేశ్ విద్యార్థినిపై ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ అసిస్టెంట్ ప్రోఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని ఫిర్యాదుతో వర్సిటీ అధికారులు జరిపిన విచారణలో సదరు ప్రొఫెసర్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో సదరు ఫ్రొఫెసర్ పై చర్యలకు విచారణ కమిటీ సిఫారసు చేసింది. నేటి ఉదయం విచారణ కమిటీ నివేదికను పరిశీలించిన వర్సిటీ కార్యవర్గ మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) ఆ ఫ్రొఫెసర్ ఉద్యోగాన్ని పీకి పారేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. అయితే బాధిత విద్యార్థిని పేరును వెల్లడించని వర్సిటీ, దురాగతానికి పాల్పడ్డ ఫ్రొఫెసర్ పేరును కూడా వెల్లడించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News